ఏంటొయ్? ఏముంది నీ దగ్గర?
వంద సార్లయినా అడిగి ఉంటాను ఇదే ప్రశ్న నిన్ను. జవాబు తెలియదు. అడక్కుండా ఉండలేను. నవ్వుతావు నిండు కుండలా నా పిచ్చిని చూసి.
భలే మత్తుగా ఉంది. నరాలు తూగుతున్నాయి. నీ స్పర్శ, కౌగిలి తర్వాత శరీరమంతా పట్టు తప్పి గాల్లో తేలుతున్నట్టు ఉంటుందే ... అలా ఉంది ఇప్పుడు. చూడు .. నీ ఆలొచన చాలు రక్తంలో ఉద్రేకం కలిగించడానికి. నిద్ర మత్తుకు భాష్యం ఎలా చెప్తుందో కలం .. నీ అలోచన మహత్యం.
ఏం చేస్తూఉంటావ్? ప్రశాంతంగా బజ్జుకుని ఉంటావేమో. నేనుంటే నీ పక్కన, నిద్రాదేవిని తరిమేసేదానిని, ముద్దులతో, కౌగిలింతలతో. ఇవాళేంటో ... భలే mood లో ఉన్నాను. సాయంత్రం ఏదో గారడీ చేసావు. నేనిక్కడ drunken monkey లా ఉన్నాను. వచ్చెయ్యరాదు? ముద్దులతో నిద్రపుచ్చరాదు? Miss you ఇవాళ నిజంగా.
ఇప్పటి ఈ మనసు స్థితికి, మళ్ళా నిన్ను కలిసిన క్షణం అమాంతంగా హత్తుకుని "Missed you" అనకపొతే చాలు, ఎక్కడున్నాం అనే ధ్యాసే లేకుండా. Love you. Miss you sweetheart..
ఇళయరాజా పాటలు వింటూ, C++ చదువుకుంటూ ఉంటే ... ఎదో పాటలో ఎదో ఒక సంగతి నిన్ను గుర్తుతెచ్చి మొత్తం mood మార్చేసింది. ఒంటికి చల్లగాలి నీ ముద్దులా హాయిగా ఉంది.
Missing you.
చదువుకోవాలి .. hence catch you later :( :(
No comments:
Post a Comment