Tuesday, August 14, 2012

You


ఎంత విచిత్రమో తెలుసా నువ్వు నాకు?

కాల్చేసే విరహాన్ని కలిగిస్తావు,
ఎన్ని యుగాలైనా అలుపు లేకుండా గడిపేస్తాను, నీ చేతులలో, ముద్దులలో, నిట్టూర్పులలో ... కౌగిలింతల్లో.
ఆ అదృష్టమే ఉంటే మనకు ఎన్ని రాత్రులైనా తనివి తీరేది కాదేమో!!! కేవలం శరీరాల తపన కాదు కదా, మనసుల ఆత్రం, ఆత్మల సంగమం. 'We can never get enough of each other, no matter how much time you spend, how many moments you share ...'

గీతాంజలి మొదటి కవిత గుర్తొస్తుంది ...

".. దోసిలి పట్టి ఉంచాను, దశాబ్దాల నుండి నువ్వు వర్షిస్తూనే ఉన్నావు, నేను పడుతూనే ఉన్నాను.అయినా నా పాత్ర నిండదు" అంటాడు కవి.

ఆదే నీతో ... అసలా పట్టింపే లేకుండా ఉండిపోగలను. నీ మాట వింటూ, నీ పెదాల కదలిక చదువుతూ, నీ నవ్వు చూస్తూ, నీ కళ్ళను ఆస్వాదిస్తూ ... ఎంతసేపైనా గడిపేయగలను. That is the link to calmness. ఏమిటి అంటే వర్ణించలేను. I don't know how to put it on paper. It is filling. మెల్లగా ప్రవహిస్తున్న సెలయేటి పై పడే చంద్రుని కిరణాలను చూస్తూ ఉంటే మనసు స్పందిస్తుంది చూడు .. అలా ఉంటుంది నాకు నీతో ఏదైనా సరే.

నిజంగానే. ఎలానో చెప్పనా ...

సెలయేరు. వెన్నెల. వాగు పక్కనే ఇల్లు.
గడప మీద కూర్చుని ఏటి పైన జారే వెండి తీగలను చూస్తున్నట్టు ఉంటుంది, నీ చూపు నాకు.

తన సొగసును ఇనుమడింపజేసిన చందమామను చూసి నవ్వుతూ ... మిన్నాగులా వంపులు తిరుగుతూ సొగసుగా నాట్యం చేసే ఏటి పాయల ఆనందం ... నా సొంతం.
నీ పరిష్వంగం లో కరిగిపోయే క్షణం.

ఉరుకుతూ, పరుగులు పెడుతూ పాల నురుగ తో పుడమిని తాకే జలపాతం అనుభవించే పరవశం నా మేని లో కలిగిస్తుంది, నీ ముద్దు.
పెదవులను మెల్లగా అద్ది నీ సంతకం పెట్టే క్షణాన.

సమీరం. చల్లని గాలి ఒక్కసారిగా ఒంటిని తాకితే వెన్నులోనుండి కలిగే పులకరింత కలుగుతుంది, నా నడుము నీ చేతిలో చిక్కినప్పుడు.

నన్ను నీ చేతులలో బంధించి, బిగియార కౌగిలించి, ముద్దులతో ముంచెత్తి .. అణువణువూ నీలో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు ...  సమస్త ప్రకృతిని, చెట్టునూ, చేమనూ, నీటినీ, మంచునూ, కొండనూ, కోననూ ... దాటుకుంటూ, వాటిలో లీనమైపోతూ, గగనం లో ఎగురుతున్న పక్షి పొందే అనుభూతి అందుకుంటుంది మనసు.

నీలో లీనమయ్యే క్షణం!!! ప్రపంచపు ఆవలి తీరాన, సమస్త జీవకోటి అస్థిత్వానికి కారణమైన దివ్య తేజస్సు ... నా కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళు చూడలేనంత మిరుమిట్లుగొలుపుతూ. అద్బుతం. ఆనిర్వచనీయం. అనుభవించగలను అంతే. ఎన్నో జన్మల వెతుకులాట, తపన, శొధన అన్నీ అంతమయ్యే వెలుగు అది. ఎంత పిచ్చిదానిలా వెతికినా కనిపించక, ఎంత తపించినా దొరకక .. సృష్టి ఆరంభం నుండీ నాతో దోబూచులాడుతూ నీలో దాగిన శక్తి. నన్ను నీతో కలిపిన force, నీ వైపు లాగిన అయిస్కాంతం.

జన్మ సార్ధకత్వం. It is my purpose. My destiny. And that is why I am 'in peace' with you. Love you.

Peace


నీ గుండెల్లో తలదాచుకుని, నీ చేతులలో ఒదిగిపోయి, నీ ఊపిరి నాకు వెచ్చగా తగులుతూ ఉంటే మనసంతా నిండిపోతుంది. ఇంకేమి కావాలి అనిపిస్తుంది. నీ చేతులు నన్ను చుట్టుకుంటే స్వర్గం అనిపిస్తుంది.

జీవితాదర్శం లో దేశికాచారి అంటాడు - "జీవితం లో అద్భుతం తారసపడితే ఎక్కడి నుండి వచ్చింది, ఎలా సాధ్యమైంది లాంటి ప్రశ్నలే రావు. దొరకడం అపురూపం, అదే అదృష్టం అనుకుంటావు" అని. నిన్ను చూస్తే అదే అనిపించింది.

ఆ పుస్తకం చదివిన రోజులలో తెలియలేదు, 'peace' గురించి చెప్తుంటే. గొప్ప అనుభూతి, చాలా బావుంటుంది కాబోలు అనుకున్నా. అర్ధం అయ్యింది అనుకున్నాను కాని అనుభవం లేదు.ఇంకా బాగా గుర్తుంది, కాలేజీ మూసేసే సమయం,  సాయంత్రం ఆరు నలభై కావొస్తుంది, Library లో ఒక చివర కూర్చుని 'జీవితాదర్శం' చివరి పేజీ చదివాను. పుస్తకం మూసిన కొన్ని నిమిషాలకు గాని చుట్టుపక్కలు గుర్తురాలేదు.తర్వాత ఏదో ఉద్వేగం.  ఏదో discover చేసిన sense. మనసాగక college చుట్టూ cycle మీద చక్కర్లు కొట్టి నా ఆస్థానం - ఒక చెరువు ఉండేది campus లో, చెట్ల మధ్య - ఎండుటాకులను దాటుకుంటూ వెళ్ళి కుర్చున్నాను చాలా సేపు. చలం గారిని చదవడం అప్పుడే మొదలు. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత ఆయన నవలలకన్నా (ఒకటి రెండు కంటే ఎక్కువ చదవలేదు) ఆయన గురించే ఎక్కువ చదివాను.      

నీతో ఆ "శాంతి" లభించింది నాకు.

అందుకే నీతో నా బంధం మట్టికీ మొక్కకీ  ఉన్నంత సహజంగా ఉంటుంది.

May be this is what 'Made for each other' means!!!