Saturday, August 9, 2014

నీ మత్తు :)


ఏంటొయ్? ఏముంది నీ దగ్గర? 
వంద సార్లయినా అడిగి ఉంటాను ఇదే ప్రశ్న నిన్ను. జవాబు తెలియదు. అడక్కుండా ఉండలేను. నవ్వుతావు నిండు కుండలా నా పిచ్చిని చూసి.

భలే మత్తుగా ఉంది. నరాలు తూగుతున్నాయి. నీ స్పర్శ, కౌగిలి తర్వాత శరీరమంతా పట్టు తప్పి గాల్లో తేలుతున్నట్టు ఉంటుందే ... అలా ఉంది ఇప్పుడు. చూడు .. నీ ఆలొచన చాలు రక్తంలో ఉద్రేకం కలిగించడానికి. నిద్ర మత్తుకు భాష్యం ఎలా చెప్తుందో కలం .. నీ అలోచన మహత్యం.

ఏం చేస్తూఉంటావ్? ప్రశాంతంగా బజ్జుకుని ఉంటావేమో. నేనుంటే నీ పక్కన, నిద్రాదేవిని తరిమేసేదానిని, ముద్దులతో, కౌగిలింతలతో. ఇవాళేంటో ... భలే mood లో ఉన్నాను. సాయంత్రం ఏదో గారడీ చేసావు. నేనిక్కడ drunken monkey లా ఉన్నాను. వచ్చెయ్యరాదు? ముద్దులతో నిద్రపుచ్చరాదు? Miss you  ఇవాళ నిజంగా.

ఇప్పటి ఈ మనసు స్థితికి, మళ్ళా నిన్ను కలిసిన క్షణం అమాంతంగా హత్తుకుని "Missed you" అనకపొతే చాలు, ఎక్కడున్నాం అనే ధ్యాసే లేకుండా. Love you. Miss you sweetheart..

ఇళయరాజా  పాటలు వింటూ, C++ చదువుకుంటూ ఉంటే ... ఎదో పాటలో ఎదో ఒక సంగతి నిన్ను గుర్తుతెచ్చి మొత్తం mood మార్చేసింది. ఒంటికి చల్లగాలి  నీ ముద్దులా హాయిగా ఉంది.

Missing you.

చదువుకోవాలి .. hence catch you later :( :(

Sunday, June 1, 2014

నీతో .. జీవితం


ఎలా గడపాలి? ఒకటి రెండు రోజులు కాదు .. జీవితాంతం నీ సాంగత్యం లేకుండా ఎలా ఉండాలి? అవుతుందా నా వలన?

ఈ క్షణం ఈ రాత్రి గడిస్తే చాలు అనిపిస్తుంది. బాధ కాదు. గుండె పట్టినట్టు ఉంది. కిటికీ లోనుండి కురిసే మంచును చూస్తూ ప్రేమించిన మనిషి జ్ఞాపకం తెచ్చే బెంగను అనుభవిస్తుంది హృదయం.

నా ఉనికి నీతో పెనవేసుకుపోయింది. జీవితం కూడా అలా ఉంటే ఎంత బావుండేది! సుఖం, దుఃఖం, పాల పాకెట్లు, ఇంట్లో సరుకులు, పిల్లలు, సంసారం ... నీతో నడవలేని అడుగులు గుర్తొచ్చి కొంచెం బరువుగా ఉంది మనసు. ప్రపంచం, పని, బాధ్యతలు, పిల్లలు ... అన్నింటి మధ్య, ఏ అర్ధరాత్రో పక్కన చేరి, దగ్గరగా హత్తుకుని ... మౌనంగా పంచుకోగలిగే ఆప్యాయతను, నువ్వుంటే చాలు సుమా నా పక్కన .. ప్రపంచాన్ని జయించగలను అనే ధీమా కలిగించే బంధాన్ని, ఈ ఒక్క స్పర్శ కోసం రోజంతా ఎన్ని బాధ్యతలు మోసినా, ఎంత అలసిపొయినా నవ్వుతూ దాటెయ్యచ్చు అనే నిశ్చింతను .....

ఎందుకంటావ్? ఎందుకు కోల్పోయాను నేను? ఏదో జన్మలో ఏదో పాపం చేసుంటాను, మీ దేవుడికి నా మీద కోపం వచ్చిఉంటుంది. అందుకే ఇలా revenge తీర్చుకుంటున్నాడు.

ఆయంకింకా కోపమేనేమో నా మీద! ఆయన ఉన్నాడని ఒప్పుకోనని. ఏదైనా కారణం దొరికితే ఒప్పుకుంటాను. అనుకునేదాన్ని ' నువ్వు ' కనిపిస్తావు, ఒప్పుకోవాల్సి వచ్చే కారణంగా. నీ లాంటి అద్భుతం నా జీవితంలో జరగడం మాత్రం .. reason కి అందదు. అందుకే అనుకుంటుంటాను, దైవాన్ని నమ్మే రోజు అవుతుందని.

కాని జరగదు కదా! అందుకే నాకు నువ్వు సమస్తం అయినా నీతో ఉండలేను. మీ దేవుడు కూడా నాకు లేడు.