Music has magic. Nature is magic.
సంగీతం, ప్రకృతి కదిలించినంత నువ్వే చెయ్యగలవు నన్ను.
బహుశా అందుకే సంగీతంలోను ప్రకృతి లోనూ నిన్ను వెతుక్కుంటాను చాలాసార్లు.
I believe I am destined to meet you, నా నమ్మకాలకు అతీతంగా.
Somehow appeal అవుతుంది ఆ ఆలొచన. ఎందుకో చెప్తాను.
Here is where faith comes to place.
ఎలాంటి అమ్మాయినో తెలుసా నీకు? బాల్కనీలోనుండి ఆకాశంలో ఒక చిన్ని తార... చుట్టుపక్కలంతా వింత మెరుపుతో నీలం పరుచుకోవడం చూసి .... పరిగెత్తుకుంటూ మేడమీదకు వచ్చి పది నిమిషాలు అలా చూస్తూ ఉండిపొయాను ఒక్కసారి. It was so good. నువ్వు నన్ను దగ్గరకు తీసుకుని చెవిలో గుసగుసగా 'love you ' చెప్పినంత అందంగా. ఆ సాయంత్రం అంతా మనసు గంతులేస్తూనే ఉంది.
ఇంటి వీధి చివర ఒక చెరువు ఉండేది. పల్లెటూరు. చెరువు గట్టు పక్కన కుర్చోవడానికి ఒక చిన్న పలకలా ఉండేది. మామూలుగా ఎప్పుడూ busyగా ఉంటుంది.పక్కనే ఉన్న మండపం లో పేకాట ఆడుకునే ముసలివాళ్ళో, సరదాగ కబుర్లు చెప్పుకునే కుర్రాళ్ళో ఎవరో ఉంటూనే ఉంటారు. ఒక రోజు college నుండి వచ్చే సమయానికి ఖాళీగా ఉంది .పండు వెన్నెల. గబా గబా ఇంటికి పరుగెత్తి , నా friend ని పట్టుకొచ్చి ఆ గట్టు మీద కుర్చున్నాను. చందమామను చెరువులో చూస్తుంటే ఇంకేమి కావాలి జీవితానికి అనిపించింది.ఎంత అందమో తెలుసా! వర్ణించలేను.నా కజిన్ ఏడిపించేవాడు, ఈ అమ్మయిని ఏ కాశ్మీరో, కేరళ నో తీసుకువెళితే ఇంక ఏమైపోతుందో అని.
... ఆ స్పందన కోల్పోతున్నానేమో బహుశా జీవితంతో రాజీ పడే ప్రయత్నంలో అనే తరుణంలో వచ్చావు నాలోనికి. నా ప్రపంచానికి. No turning back.
ఆలోచిస్తే అనిపిస్తుంది .. స్పందన పోయి కాదు .. అందం నుండి దుఃఖం లోనికి జారుతున్న సమయం అది. వెన్నెలను చూస్తే పరవశం బదులు ఏడుపు వచ్చేది.
ఏమి చేసావో మరి! I am back. More vital than ever. Traffic గోలలో, pollution లో, car లో వెళ్తూ ఉన్నప్పుడు కిటికీ అంచుల్లోనుండి నెలవంకను చూసి మొత్తం మనసంతా గంతులు వేసే స్థితికి మళ్ళీ వచ్చేసాను. గమ్మత్తుగా. ఇందులో interesting విషయం ఏమిటంటే అంతే ఆనందం, అంతే involvement నిన్ను చూసినా కలుగుతుంది. నీ గొంతు వింటే కలుగుతుంది. నీ నవ్వు చూస్తే కలుగుతుంది. నీ వేదన, నీ ఆలొచన, నీ విసుగు, నీ తపన ... everything in you triggers the same depth of feeling in me.
అందుకే ఎవరైనా నువ్వు ఎవ్వరు అని నన్ను అడిగితే ... I associate you with the stars and the sky, moon and the sun, earth and the trees ... with everything under the roof that moves my heart.
Love you.
Friday, September 14, 2012
Monday, September 10, 2012
Miss you
ఇవాళేంటో తెలీదు. చాలా చాలా బెంగగా ఉంది.
Missing you terribly.
నీతో గడపాలని ఉంది. I know this is abnormal. I know this is not fair.
అయినా చాలా strong గా ఉంది.
ఎలా manage చెయ్యను మతిలేని మతిని? ప్రొద్దుటనుండి ఎలానో నెట్టుకొచ్చాను. ఇంక నా వల్ల కావట్లేదు.
శరీరం అంతా పట్టు వదిలేస్తుంది.
I feel the longing spreading in my nerves.
ఎక్కడున్నవు? చేరగలనా నిన్ను ఈ క్షణం?
నీతో గడిచిన సమయం తలచుకుని తిట్టుకుంటున్నాను, ఆ భాగ్యం ఇప్పుడు లేనందుకు.
మనసును మందలిస్తున్నాను, ఇంత బేజారైపోతున్నందుకు.
కానీ వినట్లేదే మాట!
అత్యాశ అనిపిస్తుంది నాకు, expect చెయ్యడం, sense తో ఆలోచిస్తే.
Miss you. Too much sometimes.
Missing you terribly.
నీతో గడపాలని ఉంది. I know this is abnormal. I know this is not fair.
అయినా చాలా strong గా ఉంది.
ఎలా manage చెయ్యను మతిలేని మతిని? ప్రొద్దుటనుండి ఎలానో నెట్టుకొచ్చాను. ఇంక నా వల్ల కావట్లేదు.
శరీరం అంతా పట్టు వదిలేస్తుంది.
I feel the longing spreading in my nerves.
ఎక్కడున్నవు? చేరగలనా నిన్ను ఈ క్షణం?
నీతో గడిచిన సమయం తలచుకుని తిట్టుకుంటున్నాను, ఆ భాగ్యం ఇప్పుడు లేనందుకు.
మనసును మందలిస్తున్నాను, ఇంత బేజారైపోతున్నందుకు.
కానీ వినట్లేదే మాట!
అత్యాశ అనిపిస్తుంది నాకు, expect చెయ్యడం, sense తో ఆలోచిస్తే.
Miss you. Too much sometimes.
Tuesday, August 14, 2012
You
ఎంత విచిత్రమో తెలుసా నువ్వు నాకు?
కాల్చేసే విరహాన్ని కలిగిస్తావు,
ఎన్ని యుగాలైనా అలుపు లేకుండా గడిపేస్తాను, నీ చేతులలో, ముద్దులలో, నిట్టూర్పులలో ... కౌగిలింతల్లో.
ఆ అదృష్టమే ఉంటే మనకు ఎన్ని రాత్రులైనా తనివి తీరేది కాదేమో!!! కేవలం శరీరాల తపన కాదు కదా, మనసుల ఆత్రం, ఆత్మల సంగమం. 'We can never get enough of each other, no matter how much time you spend, how many moments you share ...'
గీతాంజలి మొదటి కవిత గుర్తొస్తుంది ...
".. దోసిలి పట్టి ఉంచాను, దశాబ్దాల నుండి నువ్వు వర్షిస్తూనే ఉన్నావు, నేను పడుతూనే ఉన్నాను.అయినా నా పాత్ర నిండదు" అంటాడు కవి.
ఆదే నీతో ... అసలా పట్టింపే లేకుండా ఉండిపోగలను. నీ మాట వింటూ, నీ పెదాల కదలిక చదువుతూ, నీ నవ్వు చూస్తూ, నీ కళ్ళను ఆస్వాదిస్తూ ... ఎంతసేపైనా గడిపేయగలను. That is the link to calmness. ఏమిటి అంటే వర్ణించలేను. I don't know how to put it on paper. It is filling. మెల్లగా ప్రవహిస్తున్న సెలయేటి పై పడే చంద్రుని కిరణాలను చూస్తూ ఉంటే మనసు స్పందిస్తుంది చూడు .. అలా ఉంటుంది నాకు నీతో ఏదైనా సరే.
నిజంగానే. ఎలానో చెప్పనా ...
సెలయేరు. వెన్నెల. వాగు పక్కనే ఇల్లు.
గడప మీద కూర్చుని ఏటి పైన జారే వెండి తీగలను చూస్తున్నట్టు ఉంటుంది, నీ చూపు నాకు.
తన సొగసును ఇనుమడింపజేసిన చందమామను చూసి నవ్వుతూ ... మిన్నాగులా వంపులు తిరుగుతూ సొగసుగా నాట్యం చేసే ఏటి పాయల ఆనందం ... నా సొంతం.
నీ పరిష్వంగం లో కరిగిపోయే క్షణం.
ఉరుకుతూ, పరుగులు పెడుతూ పాల నురుగ తో పుడమిని తాకే జలపాతం అనుభవించే పరవశం నా మేని లో కలిగిస్తుంది, నీ ముద్దు.
పెదవులను మెల్లగా అద్ది నీ సంతకం పెట్టే క్షణాన.
సమీరం. చల్లని గాలి ఒక్కసారిగా ఒంటిని తాకితే వెన్నులోనుండి కలిగే పులకరింత కలుగుతుంది, నా నడుము నీ చేతిలో చిక్కినప్పుడు.
నన్ను నీ చేతులలో బంధించి, బిగియార కౌగిలించి, ముద్దులతో ముంచెత్తి .. అణువణువూ నీలో కలిపేసుకుంటూ ఉన్నప్పుడు ... సమస్త ప్రకృతిని, చెట్టునూ, చేమనూ, నీటినీ, మంచునూ, కొండనూ, కోననూ ... దాటుకుంటూ, వాటిలో లీనమైపోతూ, గగనం లో ఎగురుతున్న పక్షి పొందే అనుభూతి అందుకుంటుంది మనసు.
నీలో లీనమయ్యే క్షణం!!! ప్రపంచపు ఆవలి తీరాన, సమస్త జీవకోటి అస్థిత్వానికి కారణమైన దివ్య తేజస్సు ... నా కళ్ళకు కనిపిస్తుంది. కళ్ళు చూడలేనంత మిరుమిట్లుగొలుపుతూ. అద్బుతం. ఆనిర్వచనీయం. అనుభవించగలను అంతే. ఎన్నో జన్మల వెతుకులాట, తపన, శొధన అన్నీ అంతమయ్యే వెలుగు అది. ఎంత పిచ్చిదానిలా వెతికినా కనిపించక, ఎంత తపించినా దొరకక .. సృష్టి ఆరంభం నుండీ నాతో దోబూచులాడుతూ నీలో దాగిన శక్తి. నన్ను నీతో కలిపిన force, నీ వైపు లాగిన అయిస్కాంతం.
జన్మ సార్ధకత్వం. It is my purpose. My destiny. And that is why I am 'in peace' with you. Love you.
Peace
నీ గుండెల్లో తలదాచుకుని, నీ చేతులలో ఒదిగిపోయి, నీ ఊపిరి నాకు వెచ్చగా తగులుతూ ఉంటే మనసంతా నిండిపోతుంది. ఇంకేమి కావాలి అనిపిస్తుంది. నీ చేతులు నన్ను చుట్టుకుంటే స్వర్గం అనిపిస్తుంది.
జీవితాదర్శం లో దేశికాచారి అంటాడు - "జీవితం లో అద్భుతం తారసపడితే ఎక్కడి నుండి వచ్చింది, ఎలా సాధ్యమైంది లాంటి ప్రశ్నలే రావు. దొరకడం అపురూపం, అదే అదృష్టం అనుకుంటావు" అని. నిన్ను చూస్తే అదే అనిపించింది.
ఆ పుస్తకం చదివిన రోజులలో తెలియలేదు, 'peace' గురించి చెప్తుంటే. గొప్ప అనుభూతి, చాలా బావుంటుంది కాబోలు అనుకున్నా. అర్ధం అయ్యింది అనుకున్నాను కాని అనుభవం లేదు.ఇంకా బాగా గుర్తుంది, కాలేజీ మూసేసే సమయం, సాయంత్రం ఆరు నలభై కావొస్తుంది, Library లో ఒక చివర కూర్చుని 'జీవితాదర్శం' చివరి పేజీ చదివాను. పుస్తకం మూసిన కొన్ని నిమిషాలకు గాని చుట్టుపక్కలు గుర్తురాలేదు.తర్వాత ఏదో ఉద్వేగం. ఏదో discover చేసిన sense. మనసాగక college చుట్టూ cycle మీద చక్కర్లు కొట్టి నా ఆస్థానం - ఒక చెరువు ఉండేది campus లో, చెట్ల మధ్య - ఎండుటాకులను దాటుకుంటూ వెళ్ళి కుర్చున్నాను చాలా సేపు. చలం గారిని చదవడం అప్పుడే మొదలు. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత ఆయన నవలలకన్నా (ఒకటి రెండు కంటే ఎక్కువ చదవలేదు) ఆయన గురించే ఎక్కువ చదివాను.
నీతో ఆ "శాంతి" లభించింది నాకు.
అందుకే నీతో నా బంధం మట్టికీ మొక్కకీ ఉన్నంత సహజంగా ఉంటుంది.
May be this is what 'Made for each other' means!!!
Sunday, April 15, 2012
Where have you been???
తెలుసా నీకు?
Do you know what you do to my insides?
వందేళ్ళు గడిపినా ... I still need it అంటానేమో!
ఇంకా ఏదో కావాలన్న తపన కాదిది. ఇంకేమి వద్దనే సంతృప్తి.
నీలాకాశంలో సూర్యోదయం చూసే కళ్ళకు కలిగే ఆనందం ... నీ సాంగత్యం.
వెన్నెలను ఆస్వాదించే మనసుకు కలిగే సంతోషం నీ పరిచయం.
ఏమైపొయావు ఇన్ని రోజులు?
Where have you been???
Do you know what you do to my insides?
వందేళ్ళు గడిపినా ... I still need it అంటానేమో!
ఇంకా ఏదో కావాలన్న తపన కాదిది. ఇంకేమి వద్దనే సంతృప్తి.
నీలాకాశంలో సూర్యోదయం చూసే కళ్ళకు కలిగే ఆనందం ... నీ సాంగత్యం.
వెన్నెలను ఆస్వాదించే మనసుకు కలిగే సంతోషం నీ పరిచయం.
ఏమైపొయావు ఇన్ని రోజులు?
Where have you been???
మరోజన్మ, to have you back.
I know you as well as my sleeve.
And that is why we are in love.
Its written and it is not our choice.
Its never been.
And I am here crying, smiling ...... and loving you.
Its you and me and the world!!!
Else ... nothing is real.
ఏమి చెప్పేది? మాటల్లేవు.
It feels so complete and right with you.
Only you. My love.
మరోజన్మ, to have you back.
And that is why we are in love.
Its written and it is not our choice.
Its never been.
And I am here crying, smiling ...... and loving you.
Its you and me and the world!!!
Else ... nothing is real.
ఏమి చెప్పేది? మాటల్లేవు.
It feels so complete and right with you.
Only you. My love.
మరోజన్మ, to have you back.
Subscribe to:
Posts (Atom)