నీ గుండెల్లో తలదాచుకుని, నీ చేతులలో ఒదిగిపోయి, నీ ఊపిరి నాకు వెచ్చగా తగులుతూ ఉంటే మనసంతా నిండిపోతుంది. ఇంకేమి కావాలి అనిపిస్తుంది. నీ చేతులు నన్ను చుట్టుకుంటే స్వర్గం అనిపిస్తుంది.
జీవితాదర్శం లో దేశికాచారి అంటాడు - "జీవితం లో అద్భుతం తారసపడితే ఎక్కడి నుండి వచ్చింది, ఎలా సాధ్యమైంది లాంటి ప్రశ్నలే రావు. దొరకడం అపురూపం, అదే అదృష్టం అనుకుంటావు" అని. నిన్ను చూస్తే అదే అనిపించింది.
ఆ పుస్తకం చదివిన రోజులలో తెలియలేదు, 'peace' గురించి చెప్తుంటే. గొప్ప అనుభూతి, చాలా బావుంటుంది కాబోలు అనుకున్నా. అర్ధం అయ్యింది అనుకున్నాను కాని అనుభవం లేదు.ఇంకా బాగా గుర్తుంది, కాలేజీ మూసేసే సమయం, సాయంత్రం ఆరు నలభై కావొస్తుంది, Library లో ఒక చివర కూర్చుని 'జీవితాదర్శం' చివరి పేజీ చదివాను. పుస్తకం మూసిన కొన్ని నిమిషాలకు గాని చుట్టుపక్కలు గుర్తురాలేదు.తర్వాత ఏదో ఉద్వేగం. ఏదో discover చేసిన sense. మనసాగక college చుట్టూ cycle మీద చక్కర్లు కొట్టి నా ఆస్థానం - ఒక చెరువు ఉండేది campus లో, చెట్ల మధ్య - ఎండుటాకులను దాటుకుంటూ వెళ్ళి కుర్చున్నాను చాలా సేపు. చలం గారిని చదవడం అప్పుడే మొదలు. విచిత్రం ఏమిటంటే ఆ తర్వాత ఆయన నవలలకన్నా (ఒకటి రెండు కంటే ఎక్కువ చదవలేదు) ఆయన గురించే ఎక్కువ చదివాను.
నీతో ఆ "శాంతి" లభించింది నాకు.
అందుకే నీతో నా బంధం మట్టికీ మొక్కకీ ఉన్నంత సహజంగా ఉంటుంది.
May be this is what 'Made for each other' means!!!
No comments:
Post a Comment