Sunday, May 3, 2020

వర్షం ... నువ్వూ ... నేనూ!!




మూడు రోజుల నుండి వర్షాలు. వాతావరణం చాలా బావుంది. ఇంట్లో కుర్చుని కాఫీ కప్పుతో మధ్యాహ్నాలు గడిపెయ్యాలని ఉంది. ఇలాంటి సమయాలలో నిన్ను మామూలు కన్న ఎక్కువే Miss అవుతున్నా. Dramatic గా చెప్పాలంటే english cinema లో మంచులో sweater కప్పుకుని, చేతులు రెండూ కట్టుకుని దగ్గరకు జరుపుకుంటూ, నడుస్తూ, తన మనిషిని miss అవుతున్న heroine లా ఉంది నా పరిస్థితి. Terribly missing your company.

కిటికీలోనుండి వర్షం మంచం మీద పడుతుందని తలుపులు వేసి పడుకుంటున్నాను. మొన్న రాత్రి, ఏ ఒంటిగంటో అయి ఉంటుంది, వెచ్చగా రగ్గు కప్పుకుని నిద్రపొయాక, టపటప చినుకులు కిటికీ అద్దాలకు తగిలి శబ్డం చేస్తుంటే మెలకువ వచ్చింది. ఆ రగ్గు వెచ్చదనం, చినుకుల శబ్దం .... ఏమని చెప్పేది మనను ఎంతలా నీ వైపు లాగిందో! చాల మామూలు అనుభవం, ఎన్నో వందల సార్లు నేను ఆస్వాదించిన అదే అనుభవం, ఆ క్షణం మాత్రం నీ కౌగిలింత లేనందుకు అసంపూర్ణంగా ఉండిపొయింది. 

--------------

ఆఫీసు నుండి వస్తూ ఉండగా ఇవాళ గమ్మత్తైన అనుభవం. ఆటో లో ఉన్నాను. sudden గా వర్షం. ఒక వైపు నుండి చినుకులు పడి తడిపేస్తున్నాయి. నేనేమో earphones పెట్టుకుని  ఆనంద్ పాటలు వింటున్నాను. అమ్మాయి పాడుతుంది - "నువ్వేనా నా నువ్వేనా ... నువ్వేనా నాలో నువ్వేనా" అని. అందులో ఒక line ఉంది: " ... చేరువైనా దూరమైనా ఆనందమేనా" అని.  Now I know what it means. నా దగ్గర లేవు. చూడనే లేదు నిన్ను కాని మాటల్లో చెప్పలేను how close I felt you ఆ నిమిషంలో.

వర్షం అంటే అందం. సంగీతం ఆనందం.
నా మనసుకు ఆ అందాన్ని ఆనందాన్ని అద్దేది నువ్వు కదా!
What-it-is-to-fall-in-love అంటే ఏమిటో ఆ క్షణం తెలిసిందేమో!