ఇప్పుడే లేచాను నిద్ర నుండి.
కిటికీ సందుల్లోనుండి చల్లని గాలి, కొబ్బరాకుల గలగల, బావుంది.
మంచి పాట వింటూ గుండెల నిండా ఊపిరి తీస్కుంటే వెంటనే నువ్వే మనసులో.
'మాట్లాడాలి, ఎలా?' అనుకుంటూ ఉంటే ఈ రాత మెదిలింది అలోచనలో.
ఏం చేసేదాన్నో నువ్వు పక్కనే ఉంటే. బావుంది ఊహ. నిద్రలేచిన వెంటనే నీ కళ్ళు చూసే అవకాశం ఉంటే, నన్ను నేనే అసూయ పడేదాన్నేమో! నిన్ను ఆఘ్రానిస్తూ నిద్దుర లేచి, నీ కౌగిలింతకు కళ్ళు తెరిస్తే రొజూ, ప్రపంచం ఎంత భీతావహమైనా, ఆ ఒక్క కారణం చాలదూ, జీవితాన్ని ప్రేమించడానికి.
ఇప్పటి వరకు కొబ్బరాకులు వెన్నెల్లోనే అందంగా ఉంటాయి అనుకునేదాన్ని.
ఉదయం తెమ్మెరకి చిన్నపిల్ల ఆనందంతో గంతులు వేసినప్పుడు కేరింతలు కొట్టినట్టు ఊగుతూ శబ్దం చేస్తున్నయి. ఒక ఆకు తన అంచుని నా కిటికీ కి ఆన్చి ఆ డోలాయమాన ఆనందాన్ని నాకు చేరవేస్తుంది.
మనసు పరవళ్ళు తొక్కుతుంది. శుభోదయం.