వర్షం చూస్తే ఏమనిపిస్తుంది నీకు?
ఒక సారి చెప్పావు గుర్తుందా, చిన్నతనంలో వర్షం కురుస్తుంటే
కిటికీ సందుల్లోనుండి వాన చినుకులను చూడటం చాలా ఇష్టంగా ఉండేది అని.
ఏదైనా భావం, గాఢంగా ఉంటుంది, వర్షంలో చూస్తూ ఉంటే.
ఆనందమైనా, ప్రేమైనా ... చివరికి ఏడుపైనా.
నీలిమబ్బు ఆకాశాన్ని వదలలేక, నీటి బొట్లుగా నేలకు రాలిందేమో అనిపిస్తుంది
నాకు ఏడుపు వచ్చినప్పుడు వర్షాన్ని చూస్తుంటే.
నీ కౌగిలినుండి దూరమయ్యే నీలిమబ్బునే నేను, ఆకాశమంత నీ ముందు.
చినుకు తాకిడికి పులకరించి, అణువణువునా ప్రాణం నింపి,
పచ్చని చెట్లను ఆకాశానికి అంకితమిస్తూ నిలబడ్డట్టు ఉంటుంది నేలను చూస్తే.
నీతో ఉండలేని ప్రతిక్షణం ఖరీదు, నిన్ను ఆరాధించే మనసుకి తెలుసు.
ఈ రాతకు, ఆ భూమికి కారణ ధాతువు ఒకటే, వియోగం.
నా కలం కదలికకు కారణం మన వియోగమే కదా.
తన సారాన్నంతా పచ్చదనానికి రంగరించి తన ప్రేమను, కృతఙ్ఞతను,
ఆనందాన్ని అందంగా పరుస్తుంది, గగనానికి కనువిందుగా ధరణి.
ఈ రాయడం కూడా అలాంటిదే.
ఒక అందమైన పాట వస్తుంది రేడియోలో.
जिस्म तो सिर्फ़ एक बहाना है
रूह तक साथ साथ जाना है
हाथ जब से है तेरा हाथों में है
मेरा हाथों में य जमाना है

-- దేహం ఒక వంక మాత్రమే.
సమాధి వరకు కలిసి వెళ్ళల్సిన వాళ్ళం.
నా చేయి నీ చేతిలో ఉన్నప్పటి నుండీ ఈ ప్రపంచం నా చేతుల్లో ఉంది.
जिस्म तो सिर्फ़ एक बहाना है ...
ఎంత నిజం, దేహం మనసు భావ వ్యక్తీకరణానికి యానకము కదా!
And I say I am blessed.
ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా?
మట్టిలో కలిసిపొయేవరకు, నీ స్పర్శ నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది, నీ జ్ఞాపకాన్ని నాతో పాటుగా మోస్తూ.
What am I if not blessed!!!
No comments:
Post a Comment