Thursday, June 23, 2011

Come back

My instinct was right!

ఎప్పుడైనా ఈ రోజు తలపులోకి వస్తే చాలా భయంకరంగా తోచేది. Always imagined it to be very very terrible. మిన్ను విరిగి నేల మీద పడుతుందేమో ... అనుకునేదాన్ని. కాని చాలా నిశ్శబ్దంగా ఉంది. 

నీ మాట విన్నాకా, బహుశా మనం, మన బంధం ... ఇవన్నీ ఎంత కాలం ఉంటాయో తెలియని సందిగ్ధతలో ఉన్నానని తెలిసాకా .... ఏడుపు వస్తుందనుకున్నాను. రాలేదు. నిస్సత్తువ!!!  That is what it is all about. Terrible. Total freeze of everything. Activity loss. శరీరం నుండి energy అంతా drain అయిపోతున్నట్టు అనిపించింది.

అప్పుడొచ్చి పలకరించావు నన్ను. సందేహాలు అలానే ఉన్నా, మనసు, శరీరం తేలికయిపొయాయి. That is addiction I guess. I now know what it means.

కొంచెం కొంచెం స్తిమితం పడ్దాకా పొంగుకొచ్చింది దుఃఖం. కోపం, పరిస్తితుల మీద, నీ మీద, నా మీద.  I can't afford this distance. జీవించలేనని చెప్పడం లేదు. కాని మనసు మళ్ళీ మామూలవుతుందా? I will loose my link to Peace. Completion. Serenity. Happiness. Love.  

కిటికీ నుండి మళ్ళీ కొబ్బరాకునే చూస్తున్నాను.
మబ్బులు ముసిరిన ఆకాశాన్ని దీనంగా వేడుకుంటుంది, నన్ను వెలిగించే రారాజు కనపడడేంటి అని. నేల వైపు వాలిపోయి వాపోతోంది, నీకేమైనా తెలుసా అని. తన అణువణువునూ వెలిగించి, జ్వలింపజేసి, అద్భుతమైన అందాన్ని ఆవిష్కరించిన ప్రణయమూర్తి ఆచూకి కోసం, అతను లేని ఆకాశాన్ని నిలదీస్తుంది. ఇక రాడా నా చెలికాడు అని దిగాలు పడుతుంది. తన అంచుల్లో ఇంద్రధనుస్సును అల్లే చందమామ కోసం ప్రాణాన్నంతా కళ్ళల్లో పెట్టుకుని ఎదురుచూస్తుంది. నాకు నువ్వు గుర్తొచ్చావు.

హోరుగాలి, వర్షం. బహుశా నింగి కరిగి కురుస్తుందేమో.
తట్టుకోగలనా? బ్రతుకుందా ఆత్మ నీకు దూరంగా?

Its every cell aching inside. Crying.
Every atom screaming my need for you.
You are my ultimate vulnerability.
I am nothing but moving flesh without you.

Please ... Come back.
We don't deserve this. This terrible distance.

Sunday, June 19, 2011

వెళ్ళకు, అప్పుడే!!

ఏమైపొయావు? దొరకట్లేదు నాకు.
ఏదో పిచ్చి ఆలోచన. భయమేసింది. దూరమైపోవు కదా నువ్వు నాకు!
ఏం చెయ్యగలను నిజంగా జరిగితే.

నా చేతుల్లోది కాదు కదా, వెన్ను లోనుండి వణుకు పుడుతుంది, ఆ ఆలోచనే.
వదిలి వెళ్ళకు. బతిమాలుతున్నాను. కొన్ని రోజులు. ఇంకొన్ని రోజులు వదిలి వెళ్ళకు.
ఇంకా అంత Strength రాలేదు.
కూడదీసుకుంటున్నాను. కాని సరిపొవట్లేదు.

తెలుసు నాకు ఏదో ఒక రోజు తప్పదని. ఆ రోజు నాకు తెలీకుండానే నా ముంగిట్లో ఉంటుందని.
కాని ఇప్పుడు కాదు.

.......................

మనసు ఉన్నట్టుండి పిచ్చిదైపోయింది ఇవాళ ఉదయం. అందుకే ఆ రాతలన్నీ. కాని నువ్వు ఎంత అద్భుతమైన మనిషివో తెలుసా నీకు! నీ గొంతు వినగానే సందేహాలు, భయాలు అన్నీ పటాపంచలైపొతాయి. Immense sense of belonging. అందుకే అంత తక్కువ సమయము దొరికినా ఇంత భరోసా.

You are one in a million!!

నీ కళ్ళలో కనిపించే ఆ నిశ్చలమైన భరోసా. ఇక్కడే ఉంటాను అన్న స్థిరత్వము. 
Love you for this.
చిటికెలో నన్ను అగాధం నుండి ఆకాశానికి ఎత్త గలిగే నీ గొంతును, నీ ప్రేమను, నేను ప్రేమిస్తున్నాను.

The high and The lows!!

బెంగగా ఉంది చాలా. ఇందాక పక్క పేజీలో అంత ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పాను. ఉన్నస్ను కూడా. కానీ ఈ వాంచ ఎందుకు నన్ను కలత పెడుతుందో అప్పుడప్పుడూ అర్ధం కాదు. కొంచెం ఎక్కువగానే మిస్స్ అవుతున్నాను నిన్ను.


Lost in you. My love.

జీవితంలో అద్భుతమైన అనుభవం తర్వాత చాలా ఉపమానాలు మారిపొతాయి.
ఏదో మారుతుంది మూలాధారమైనది. ఒక్కసారి "అది" అనుభూతి చెందాక, ఆ అనుభవం తరువాత, ఇంకేమీ కనపడకుండా పోతుంది ప్రపంచం.  అది మనం చెల్లించే మూల్యమేమో. 

You ruined me for everything and everybody.

అస్పష్టం

दिल ये चाहे टूटकर चाहू तुम्हे
देदो इजाज़त टूटने की तुम हमें ...

అస్పష్టంగా అనిపిస్తుంది ఏదో రాయాలని.
తీరా కలం చేతిలోనికి రాగానే ఆలోచన మాయం అయిపొతుంది.
ఎందుకంటావ్?

Wednesday, June 15, 2011

Soul Mate

ఓయ్! అసలు ఎవరు నువ్వు? ఎక్కడ నుండి వచ్చావు? నీకే చెల్లింది, ఇప్పుడు మనసును గిలిగింతలు పెట్టినా, మరొకరోజు గుండె పగిలే దుఃఖాన్ని కలిగించినా ! ప్రపంచాన్ని అందంగా చూపించినా, ఏముందిక్కడ నీవు లేని రోజు అని ఏడిపించినా !!

ఎవరు నువ్వు అన్న ప్రశ్న వస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే యుగాలు ఆరంభమయ్యే ముందు మన పరిచయం మొదలయ్యిందేమో అనిపిస్తుంది నాకు. చాలా చాలా దగ్గరగా తెలిసిన భావం నిన్ను కలిసిన మొదటి రోజులలోనే వచ్చేసింది నాకు. చలం ప్రేమలేఖలకు ప్రారంభం రాస్తూ వర్ణించిన పరిచయం గుర్తొస్తుంది నాకు నీ పరిచయం తల్చుకుంటే.

అన్నింటికీ జవాబు తెలుసనే ధీమా వచ్చేస్తుంది, నీ సాంగత్యంలో జీవితానికి. ఇంకేమీ అవసరం లేదు. ఏదో అపురూపమైనది దొరికినందుకు కాదు, వెతుకులాటకు, అన్వేషణకు అంతం కనిపించినందుకు. నీలో కనిపిస్తుంది నాకది.  స్థిరత్వం. శాంతి. ఇంక చాలు అన్న అనుభూతి. ఆదే కదా అందం, అక్కడే మొదలౌతుంది జీవితం. నువ్వు పునాదిగా మొదలయ్యే జీవనపర్వం అద్భుతమే కదా.

మొదట్లో ఉండేది, నువ్వు లేకపోతే 'Nothing Matters' అని. ఏదో తెలుగు సినిమా పాట మనసులో మెదులుతుంది - 'ఎందుకీ ప్రాయము  నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు లేనప్పుడూ ...'

నిజంగానే  ఆ రొజులు చాలా అశాంతి గా ఉండేవి. కాని రాను రాను నువ్వు నాలో ఇంకిన తరువాత, నాలో భాగం అయ్యకా, నా వ్యక్తిత్వనానికి అనుబంధమే నువ్వ అన్నంతగా కలిసిపొయాకా, నేను వెతకడం మానేసాను, నీ దగ్గర కూడా. నువ్వు ఉన్నావు, మనం కలిసాము, అంతే చాలు! Nothing matters now too! కాని ఎంత తేడా రెండు స్థితులకూ.   

I love you.

కృతజ్ఞతలు నువ్వు నువ్వైనందుకు.
నాతో ఉన్నందుకు.
నీలా ఉన్నందుకు.

You are my perfect man. I now know what soul-mate means !!!

Friday, February 4, 2011

ఉదయ రాగం

ఇప్పుడే లేచాను నిద్ర నుండి.
కిటికీ సందుల్లోనుండి చల్లని గాలి, కొబ్బరాకుల గలగల, బావుంది.
మంచి పాట వింటూ గుండెల నిండా ఊపిరి తీస్కుంటే వెంటనే నువ్వే మనసులో.
'మాట్లాడాలి, ఎలా?' అనుకుంటూ ఉంటే ఈ రాత మెదిలింది అలోచనలో.

ఏం చేసేదాన్నో నువ్వు పక్కనే ఉంటే. బావుంది ఊహ. నిద్రలేచిన వెంటనే నీ కళ్ళు చూసే అవకాశం ఉంటే, నన్ను నేనే అసూయ పడేదాన్నేమో!  నిన్ను ఆఘ్రానిస్తూ  నిద్దుర లేచి, నీ కౌగిలింతకు కళ్ళు తెరిస్తే రొజూ, ప్రపంచం ఎంత భీతావహమైనా, ఆ ఒక్క కారణం చాలదూ, జీవితాన్ని ప్రేమించడానికి.

ఇప్పటి వరకు కొబ్బరాకులు వెన్నెల్లోనే అందంగా ఉంటాయి అనుకునేదాన్ని.
ఉదయం తెమ్మెరకి చిన్నపిల్ల ఆనందంతో గంతులు వేసినప్పుడు కేరింతలు కొట్టినట్టు ఊగుతూ శబ్దం చేస్తున్నయి. ఒక ఆకు తన అంచుని నా కిటికీ కి ఆన్చి ఆ డోలాయమాన ఆనందాన్ని నాకు చేరవేస్తుంది.

మనసు పరవళ్ళు తొక్కుతుంది. శుభోదయం.

जिस्म तो सिर्फ़ एक बहाना है .....

వర్షం చూస్తే ఏమనిపిస్తుంది నీకు?

ఒక సారి చెప్పావు గుర్తుందా, చిన్నతనంలో వర్షం కురుస్తుంటే
కిటికీ సందుల్లోనుండి వాన చినుకులను చూడటం చాలా ఇష్టంగా ఉండేది అని.
ఏదైనా భావం, గాఢంగా ఉంటుంది, వర్షంలో చూస్తూ ఉంటే.
ఆనందమైనా, ప్రేమైనా ... చివరికి ఏడుపైనా.

నీలిమబ్బు ఆకాశాన్ని వదలలేక, నీటి బొట్లుగా నేలకు రాలిందేమో అనిపిస్తుంది
నాకు ఏడుపు వచ్చినప్పుడు వర్షాన్ని చూస్తుంటే.
నీ కౌగిలినుండి దూరమయ్యే నీలిమబ్బునే నేను, ఆకాశమంత నీ ముందు.
చినుకు తాకిడికి పులకరించి, అణువణువునా ప్రాణం నింపి,
పచ్చని చెట్లను ఆకాశానికి అంకితమిస్తూ నిలబడ్డట్టు ఉంటుంది నేలను చూస్తే.
నీతో ఉండలేని ప్రతిక్షణం ఖరీదు, నిన్ను ఆరాధించే మనసుకి తెలుసు.
ఈ రాతకు, ఆ భూమికి కారణ ధాతువు ఒకటే, వియోగం.
నా కలం కదలికకు కారణం మన వియోగమే కదా.

తన సారాన్నంతా పచ్చదనానికి రంగరించి తన ప్రేమను, కృతఙ్ఞతను,
ఆనందాన్ని అందంగా పరుస్తుంది, గగనానికి కనువిందుగా ధరణి.
ఈ రాయడం కూడా అలాంటిదే.


ఒక అందమైన పాట వస్తుంది రేడియోలో.
जिस्म तो सिर्फ़ एक बहाना है
रूह तक साथ साथ जाना है
हाथ जब से है तेरा हाथों में है
मेरा हाथों में य जमाना है
-- దేహం ఒక వంక మాత్రమే. 
సమాధి వరకు కలిసి వెళ్ళల్సిన వాళ్ళం. 
నా చేయి నీ చేతిలో ఉన్నప్పటి నుండీ ఈ ప్రపంచం నా చేతుల్లో ఉంది.

जिस्म तो सिर्फ़ एक बहाना है ... 
ఎంత నిజం, దేహం మనసు భావ వ్యక్తీకరణానికి యానకము కదా!

And I say I am blessed.
ఎందుకో తెలుసా?
మట్టిలో కలిసిపొయేవరకు, నీ స్పర్శ నన్ను అంటి పెట్టుకునే ఉంటుంది, నీ జ్ఞాపకాన్ని నాతో పాటుగా మోస్తూ.

What am I if not blessed!!!

నీలిమేఘాలలో ...

'అందుకోజాలని ఆనందమే నీవు
 ఎందుకో చేరువై దూరమౌతావు
 నీలి మేఘాలలో గాలి కెరటాలలో
 నీవు పాడే పాట వినిపించెనీ వేళ ... '

రెండు విషయాలు మెదులుతాయి మనసులో పాట విన్నప్పుడల్లా
వెన్నెలలో, చల్లగాలిలో గడ్డిలో కుర్చుని నువ్వు పాడుతుంటే విన్న నిమిషం,
నా గురించేనేమో అనిపించే ఆ పదాల్లోని భావం.

'నీ చెలిమి లోనున్న నెత్తావి మాధురులు
 నా హృదయ భారమునే మరపింపజేయూ'
అంటుంటే ఆశ్చర్యపోవడానికి పదం లేదు.
నీ నోటి నుండి విన్న పాట నాకు అంత దగ్గరగా అనిపించడం, ఇదీ అని తెలపలేని, ఇందుకు అని వివరించలేని మన దగ్గరతనం వల్లనా?


ప్రేమ!
అమ్మతో చెబుతున్నా నిన్న ...
for anything in the world వదులుకునేదాన్ని కాదు,
for everything in the universe, regrets లేవు,
ఆ ఒక్క క్షణం మనసు పులకరిస్తుందే,
the realization that this is the PERFECT MOMENT అని.
దాని కోసం.

Everything comes with a cost. And you are very DEAR!!!

ఇంకా కళ్ళలో మెదులుతుంది ఆ మొదటి రోజుల తడబాటు,ఆలోచన, సిగ్గు, సందేహం, ప్రేమ, restlessness, కన్నీరు, frustration, longing.

You met me and nothing else mattered.
You kissed me and there is no turning back.

ఆరాధన!

ఆ రోజు నీతో గడిపిన సాయంత్రం మెదిలింది ఆలొచనలో.
కాఫీ కప్పు, కళ్ళనుండి ఎప్పుడు రాలుతుందో తెలియని నీటి చుక్క,
గుండెలో అవధి లేని ప్రేమ, బెంగ ... 
నీ కళ్ళలో అంతుపట్టని భావం.

పెట్టిపుట్టాలేమో మళ్ళీ అలాంటి రోజు రావాలంటే.

ఎంత అందంగా నవ్వావో తెలుసా ఆ రోజు! 
పగడాల పెట్టెలో దాచిపెట్టుకోవాలనిపించింది, నీ నవ్వుని, కంటిలో వెలుగుని.
నా చెంప పైన వేలితో రాస్తూ
'It takes a great painter to shape this ...  ' అంటుంటే 
ఆ క్షణం కొసం చచ్చిపొవచ్చనిపించింది. 
నీ కంటిలోని ప్రేమకో, నీ గొంతులోని మార్దవానికో, 
నీ మాటలోని పొగడ్తకో, నీ ముఖంలోని సంతృప్తికో ... దేనికో తెలీదు నాకు.
కాని I knew ...
I would die for that one single moment !! I knew !!!

ECSTACY is what I felt that day.

ధన్యం జీవితం .. ఆ ఆరాధనకి .. నీ ప్రేమకి ...
for everything that you are to me.
Moments like that make me feel alive.  

మధురగానం


నిన్న రాత్రి కల. చాలా స్పష్టంగా గుర్తుంది.
ఎందుకలా వచ్చిందో తెలీదు.

కల విను. చెప్తాను.

"రాత్రి. సమయం తెలీదు, చీకటి. కాటుకంత చిక్కగా.
మల్లెపువ్వు మెరుపు వెన్నెల.
నువ్వున్నవు. నాకు కనిపిస్తున్నావు.
నీరు మధ్యలో. నీకు నాకు. ఏరులా ఉంది.
మీ ఇల్లనుకుంట నీ వెనకాల.
ఏటిగట్టున నిలబడి ఉన్నాను నేను.
నన్ను చూసి లోపలికి వెళ్ళావు. కష్టపడి ఏదో మోసుకొచ్చావు.
తరువాత చూస్తే పియానో.

ఏరు ప్రవహిస్తుంటే, ఒంటికి గాలి హాయినిస్తుంటే,
పులకరించి నీ భావం చెప్పడానికా అన్నట్టు వాయిస్తున్నావు
వీనుల విందుగా ఆ పియానోని.
పరవశంగా చూస్తూ ఉండిపొయాను. మనోహరంగా ఉంది.

అంత దూరాన మౌనంగా నీటి అలల చాటున,
గాలి మోస్తున్న సంగీతం ద్వారా నీతొ మాట్లాడుతున్నాననిపించింది."

కళ్ళు తెరిచి మూస్తే అదే భావం.
ఇంత కూడా వదలలేదు మనసుని.
మధురగానం అంటారే!!
అలానే అనిపించింది. Beautiful!

Monday, January 31, 2011

నీ తలపు

వరమో శాపమో తెలీదు నాకు నువ్వు!!!
కాని కిటికీ సందున చల్లని గాలికి ఊగుతున్న కొబ్బరాకు నీ తలపును తెస్తూ అడుగుతుందా ప్రశ్న.
బహుశా గాలి మోసుకొచ్చిందేమో నీ పరిమళాన్ని.
నిద్ర మత్తున హాయిగా మూసిన నీ కనురెప్పల చాటు కలనొకటి దొంగిలించి,
నా కిటికీ చాటుకు వచ్చి నిలబడింది ఈ అర్థరాత్రి ... నన్ను నీ కలలోనికి తోసేస్తూ ...

నీతొ గడిపిన ప్రతి క్షణం, నవ్విన ప్రతి నిమిషం గుర్తొచ్చి ఆ సమయం అదృష్టానికి,
ఆ రొజుల గొప్పతనానికీ ఈర్ష్యపడుతుంది హృదయం.

"ఏమైనా పాడినా గుర్తొస్తావు, మౌనంగా ఉన్నా గుర్తొస్తావు,
ఏది పొందినా గుర్తొస్తావు, ఏది పొగొట్టుకున్నా గుర్తొస్తావు ... రోజూ ..."
అంటున్నాడు ఎవరో కవి. ఒక హింది పాట అర్థం.

అందుకే టీవీ కట్టేసాను.

అయినా నీ అలోచన పోదు కదా!!!

భోరున వర్షం వస్తుంది. మనసులో బరువంతా దించేస్తున్నట్టు కురుస్తుంది.
ఎంత నిస్సహాయ పరిస్తితో చూడు నాది, నీకు నా అవసరముందని తెలుసు.
కాని రావాలనుకున్నా రాలేని పరిస్థితి. రెక్కలు కట్టుకుని వాలి,
నిన్ను దగ్గరగా హత్తుకుని నేనున్నానని చెప్పాలని ఉంది.
చెప్పలేనని తెలిసి ఈ పుస్తకం చాటున నన్ను నేను దాచుకుంటున్నాను.

ఎంత విచిత్రం జీవితం, వద్దనుకుంటూనే బంధాలన్నీ చుట్టుకుంటాయి.
వదలాలంటే వదలలేము. ఏముంది జీవితంలో ...
పడుతూ లేస్తూ ఏడుస్తూ నవ్వుతూ జరిపే ప్రయాణంలో
చివరికి మిగిలేది మనుషుల ప్రేమలు, ఙ్ఞాపకాలే కదా.

నీ గురించి ఆలోచిస్తూ జీవితాన్ని విశ్లేషిస్తున్నాను చూడు.
ఎందుకంటావు? జీవితంలో నువ్వు ముఖ్యమనా, జీవితమే నువ్వైపొయావనా!

ఇందాక చెప్పాను చూడు, మంచి పాట వస్తుందని.

कुछ गाऊ तो याद आते हो गुनगुनाऊ तो याद आते हो
कुछ पहनू तो याद आते हो कही जाऊ तो याद आते हो
कुछ खोने पे याद आते हो कुछ पाऊ तो याद आते हो

रोजाना चले ... यादों पे तेरी ... जिंदगी कॅया सफ़र
तुझसे है रोशन ... तुझसे है ज़िंदा ... ये दिल का शहर
--- " నీ ఆలొచనలలోనే నడుస్తుంది రోజూ ఈ జీవితం, నీ వలనే వెలుగు.
నీ వలనే బ్రతికుంది నా మానసనగరం."

Love you. Finally one thing :

रोजाना जिए रोजाना मरे ... तेरी यादो में हम ... रोजाना ....
---  "రోజూ బ్రతుకుతున్నాను రోజూ మరణిస్తున్నాను ... నీ ఆలొచనలలో ... రోజూ!!"
  

మోక్షం

చూడు ఎంత బెంగ తెప్పిస్తావో నువ్వు!
ఏం రాయలేక ఆగిపొయింది కలం పక్క పేజీలో.
మళ్ళీ మాట్లాడావు, చలనం వచ్చింది మనసుకు.
ఏదో ఉందోయి మంత్రమో, మాయో నీ దగ్గర.
లేకపొతే ఇలా ఎలా కట్టిపడేస్తావు నన్ను!!

ఏమిటోయి ఆ రహస్యం?
చెప్పచ్చు కదా, కొంచెం విముక్తి లభిస్తుంది నాకు.
పొనీ వద్దులే!
ఎంత బంధించి ఉన్నానని తిట్టుకున్నా,
నీకే ఆ సమ్మోహన శక్తి లేకపొతే ఎన్ని అనుభూతులను కోల్పోయేదాన్ని!!

నీ కంటి సైగకు ఉలిక్కిపడతాను.
వాటిలో నవ్వుకు సంతోషపడతాను.
చూపులో ప్రేమకు దాసొహమంటాను.
పెదవుల రుచి తెలిసి నవ్వుకుంటాను.
మధురమైన ఊహలలో తేలిపొతాను.
నలుగురిలొ నిన్ను చూస్తూ ఉండిపొతాను.
హఠాత్తుగా స్పృహలోకి వచ్చి, చుట్టూ చూసుకుంటూ కంగారుపడతాను.

నీ చేతి స్పర్శకు వణుకుతాను.
వేలికొనలకు నర్తిస్తాను.
నీ పరిమళానికి మత్తెక్కిపోతాను.
గొంతు వింటూ నన్ను నేను మర్చిపొతాను.
మాట లోని మార్దవానికి కరిగిపొతాను.

ఒక్కటీ కనిపించదు, నీలో నన్ను ఆకర్షించని విషయం.

Adoration, admiration, love, respect, madness ...
what not !!! ఏం కాదు నువ్వు నాకు?

ఎవరిచ్చారీ చనువు అని కోప్పడతాను. కాని ఆ చనువే నువ్వు తీస్కొకుంటే ... అమ్మో అనిపిస్తుంది.

ఎంత అందం నీ ప్రేమ!!
ఆకాశమంత విశాలం. అంత భరొసా.
సముద్రమంత లోతు. అంత passion.
శిఖరమంత ఎత్తు. అంత strength.
ఎండలాంటి తీక్షణం.
నీ ఆరాధన వీణతీగలంటి మధురం.
నీ సాంగత్యం అదృస్టం. నీ నవ్వు వరం.
స్పర్శ వసంతం. ఎడబాటు గ్రీష్మం.
నీ కౌగిలి స్వర్గం. నీతొ సమయం బంగారం.

నీతో జీవితం .... మోక్షం.