ఓయ్! అసలు ఎవరు నువ్వు? ఎక్కడ నుండి వచ్చావు? నీకే చెల్లింది, ఇప్పుడు మనసును గిలిగింతలు పెట్టినా, మరొకరోజు గుండె పగిలే దుఃఖాన్ని కలిగించినా ! ప్రపంచాన్ని అందంగా చూపించినా, ఏముందిక్కడ నీవు లేని రోజు అని ఏడిపించినా !!
ఎవరు నువ్వు అన్న ప్రశ్న వస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎందుకంటే యుగాలు ఆరంభమయ్యే ముందు మన పరిచయం మొదలయ్యిందేమో అనిపిస్తుంది నాకు. చాలా చాలా దగ్గరగా తెలిసిన భావం నిన్ను కలిసిన మొదటి రోజులలోనే వచ్చేసింది నాకు. చలం ప్రేమలేఖలకు ప్రారంభం రాస్తూ వర్ణించిన పరిచయం గుర్తొస్తుంది నాకు నీ పరిచయం తల్చుకుంటే.
అన్నింటికీ జవాబు తెలుసనే ధీమా వచ్చేస్తుంది, నీ సాంగత్యంలో జీవితానికి. ఇంకేమీ అవసరం లేదు. ఏదో అపురూపమైనది దొరికినందుకు కాదు, వెతుకులాటకు, అన్వేషణకు అంతం కనిపించినందుకు. నీలో కనిపిస్తుంది నాకది. స్థిరత్వం. శాంతి. ఇంక చాలు అన్న అనుభూతి. ఆదే కదా అందం, అక్కడే మొదలౌతుంది జీవితం. నువ్వు పునాదిగా మొదలయ్యే జీవనపర్వం అద్భుతమే కదా.
మొదట్లో ఉండేది, నువ్వు లేకపోతే 'Nothing Matters' అని. ఏదో తెలుగు సినిమా పాట మనసులో మెదులుతుంది - 'ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు వద్దులే ప్రాణము నీవు లేనప్పుడూ ...'
నిజంగానే ఆ రొజులు చాలా అశాంతి గా ఉండేవి. కాని రాను రాను నువ్వు నాలో ఇంకిన తరువాత, నాలో భాగం అయ్యకా, నా వ్యక్తిత్వనానికి అనుబంధమే నువ్వ అన్నంతగా కలిసిపొయాకా, నేను వెతకడం మానేసాను, నీ దగ్గర కూడా. నువ్వు ఉన్నావు, మనం కలిసాము, అంతే చాలు! Nothing matters now too! కాని ఎంత తేడా రెండు స్థితులకూ.
I love you.
కృతజ్ఞతలు నువ్వు నువ్వైనందుకు.
నాతో ఉన్నందుకు.
నీలా ఉన్నందుకు.
You are my perfect man. I now know what soul-mate means !!!

No comments:
Post a Comment