Music has magic. Nature is magic.
సంగీతం, ప్రకృతి కదిలించినంత నువ్వే చెయ్యగలవు నన్ను.
బహుశా అందుకే సంగీతంలోను ప్రకృతి లోనూ నిన్ను వెతుక్కుంటాను చాలాసార్లు.
I believe I am destined to meet you, నా నమ్మకాలకు అతీతంగా.
Somehow appeal అవుతుంది ఆ ఆలొచన. ఎందుకో చెప్తాను.
Here is where faith comes to place.
ఎలాంటి అమ్మాయినో తెలుసా నీకు? బాల్కనీలోనుండి ఆకాశంలో ఒక చిన్ని తార... చుట్టుపక్కలంతా వింత మెరుపుతో నీలం పరుచుకోవడం చూసి .... పరిగెత్తుకుంటూ మేడమీదకు వచ్చి పది నిమిషాలు అలా చూస్తూ ఉండిపొయాను ఒక్కసారి. It was so good. నువ్వు నన్ను దగ్గరకు తీసుకుని చెవిలో గుసగుసగా 'love you ' చెప్పినంత అందంగా. ఆ సాయంత్రం అంతా మనసు గంతులేస్తూనే ఉంది.
ఇంటి వీధి చివర ఒక చెరువు ఉండేది. పల్లెటూరు. చెరువు గట్టు పక్కన కుర్చోవడానికి ఒక చిన్న పలకలా ఉండేది. మామూలుగా ఎప్పుడూ busyగా ఉంటుంది.పక్కనే ఉన్న మండపం లో పేకాట ఆడుకునే ముసలివాళ్ళో, సరదాగ కబుర్లు చెప్పుకునే కుర్రాళ్ళో ఎవరో ఉంటూనే ఉంటారు. ఒక రోజు college నుండి వచ్చే సమయానికి ఖాళీగా ఉంది .పండు వెన్నెల. గబా గబా ఇంటికి పరుగెత్తి , నా friend ని పట్టుకొచ్చి ఆ గట్టు మీద కుర్చున్నాను. చందమామను చెరువులో చూస్తుంటే ఇంకేమి కావాలి జీవితానికి అనిపించింది.ఎంత అందమో తెలుసా! వర్ణించలేను.నా కజిన్ ఏడిపించేవాడు, ఈ అమ్మయిని ఏ కాశ్మీరో, కేరళ నో తీసుకువెళితే ఇంక ఏమైపోతుందో అని.
... ఆ స్పందన కోల్పోతున్నానేమో బహుశా జీవితంతో రాజీ పడే ప్రయత్నంలో అనే తరుణంలో వచ్చావు నాలోనికి. నా ప్రపంచానికి. No turning back.
ఆలోచిస్తే అనిపిస్తుంది .. స్పందన పోయి కాదు .. అందం నుండి దుఃఖం లోనికి జారుతున్న సమయం అది. వెన్నెలను చూస్తే పరవశం బదులు ఏడుపు వచ్చేది.
ఏమి చేసావో మరి! I am back. More vital than ever. Traffic గోలలో, pollution లో, car లో వెళ్తూ ఉన్నప్పుడు కిటికీ అంచుల్లోనుండి నెలవంకను చూసి మొత్తం మనసంతా గంతులు వేసే స్థితికి మళ్ళీ వచ్చేసాను. గమ్మత్తుగా. ఇందులో interesting విషయం ఏమిటంటే అంతే ఆనందం, అంతే involvement నిన్ను చూసినా కలుగుతుంది. నీ గొంతు వింటే కలుగుతుంది. నీ నవ్వు చూస్తే కలుగుతుంది. నీ వేదన, నీ ఆలొచన, నీ విసుగు, నీ తపన ... everything in you triggers the same depth of feeling in me.
అందుకే ఎవరైనా నువ్వు ఎవ్వరు అని నన్ను అడిగితే ... I associate you with the stars and the sky, moon and the sun, earth and the trees ... with everything under the roof that moves my heart.
Love you.
No comments:
Post a Comment