Sunday, June 1, 2014

నీతో .. జీవితం


ఎలా గడపాలి? ఒకటి రెండు రోజులు కాదు .. జీవితాంతం నీ సాంగత్యం లేకుండా ఎలా ఉండాలి? అవుతుందా నా వలన?

ఈ క్షణం ఈ రాత్రి గడిస్తే చాలు అనిపిస్తుంది. బాధ కాదు. గుండె పట్టినట్టు ఉంది. కిటికీ లోనుండి కురిసే మంచును చూస్తూ ప్రేమించిన మనిషి జ్ఞాపకం తెచ్చే బెంగను అనుభవిస్తుంది హృదయం.

నా ఉనికి నీతో పెనవేసుకుపోయింది. జీవితం కూడా అలా ఉంటే ఎంత బావుండేది! సుఖం, దుఃఖం, పాల పాకెట్లు, ఇంట్లో సరుకులు, పిల్లలు, సంసారం ... నీతో నడవలేని అడుగులు గుర్తొచ్చి కొంచెం బరువుగా ఉంది మనసు. ప్రపంచం, పని, బాధ్యతలు, పిల్లలు ... అన్నింటి మధ్య, ఏ అర్ధరాత్రో పక్కన చేరి, దగ్గరగా హత్తుకుని ... మౌనంగా పంచుకోగలిగే ఆప్యాయతను, నువ్వుంటే చాలు సుమా నా పక్కన .. ప్రపంచాన్ని జయించగలను అనే ధీమా కలిగించే బంధాన్ని, ఈ ఒక్క స్పర్శ కోసం రోజంతా ఎన్ని బాధ్యతలు మోసినా, ఎంత అలసిపొయినా నవ్వుతూ దాటెయ్యచ్చు అనే నిశ్చింతను .....

ఎందుకంటావ్? ఎందుకు కోల్పోయాను నేను? ఏదో జన్మలో ఏదో పాపం చేసుంటాను, మీ దేవుడికి నా మీద కోపం వచ్చిఉంటుంది. అందుకే ఇలా revenge తీర్చుకుంటున్నాడు.

ఆయంకింకా కోపమేనేమో నా మీద! ఆయన ఉన్నాడని ఒప్పుకోనని. ఏదైనా కారణం దొరికితే ఒప్పుకుంటాను. అనుకునేదాన్ని ' నువ్వు ' కనిపిస్తావు, ఒప్పుకోవాల్సి వచ్చే కారణంగా. నీ లాంటి అద్భుతం నా జీవితంలో జరగడం మాత్రం .. reason కి అందదు. అందుకే అనుకుంటుంటాను, దైవాన్ని నమ్మే రోజు అవుతుందని.

కాని జరగదు కదా! అందుకే నాకు నువ్వు సమస్తం అయినా నీతో ఉండలేను. మీ దేవుడు కూడా నాకు లేడు.

No comments:

Post a Comment