ఎందుకింత పిచ్చిది మనసు? అన్నీ తెలిసి నిన్ను "miss" అవుతూ ఉంటాను అర్ధరాత్రి. బుర్ర కి తెలుస్తుంది అర్ధం లేదు అందులో అని. అయినా సర్దిచెప్పుకోలేను ఒక్కొక్కసారి.
చిన్ని కోరిక. అర్ధరాత్రి నిద్రపోతుంటే, పక్కనే వచ్చి చూసుకుని, తల మీద చెయ్యి వేసి నిమిరి, నుదిటి మీద ముద్దుపెట్టి, దుప్పటి కప్పి నువ్వు వెళితే, నీ ఉనికిని నిద్రలో అనుభూతి చెందే అదృష్టం కావాలి నాకు.
తీరని కోరికే కదా అది! Scotland లో ranch earn చెయ్యగలనేమో. Library with glass doors and walls on a cliff build చెయ్యగలనేమో. కాని ఒక్క రాత్రి ... అ నిలకడ జీవితంలో సంపాదించగలనన్న ఆశ లేదు. మనసు కొంచెం కలతగా ఉంది. దిగులు లేదు. Irony of life.
అలా అని జీవితంలో purpose లేదననోయి. ఉంది. నువ్వున్నావు. I will always hear those words ... "Go win the world. Take my strength and win the world." అలా నువ్వు చెప్పిన క్షణం, it is a moment of a lifetime.
కాకపోతే అప్పుడప్పుడూ ఇలాంటి రాత్రులు మనసు అదుపు తప్పుతూ ఉంటుంది. ఎంటో విచిత్రంగా బాధగా ఉండదు. కాని నిద్రపోలేను. ఇదిగో, ఇలా లేచి ఏదో రాస్కుంటూ ఉంటాను. Emerson లోనో , Shakespeare లోనో నన్ను నేను మర్చిపోతాను. లేదూ algorithms చదవడానికి కుస్తీ పడతాను. Worry కాను. కానీ మిస్స్ అవ్వకుండా ఉండలేను. అది అడగద్దు నా దగ్గర నుండి. I cannot help missing you.
ప్రేమకు ఇంత శక్తి ఉందని తెలీదు నాకు. నువ్వు లేకుండా క్షణం ఉండలేని అనుబంధాన్ని ఏర్పరిచిన అదే భావం, నువ్వు లేకుండా జీవితాంతం గడిపే ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. The only thing that gives me the strength to live without you is YOU.
Love you. Beyond me. Beyond you.
Miss you like hell.
No comments:
Post a Comment